ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 23:02:58

ఓపీజీసీ ఈక్విటీ షేర్లలో 49 శాతం వాటాలో అదానీకి అనుమతి

ఓపీజీసీ ఈక్విటీ షేర్లలో 49 శాతం వాటాలో అదానీకి అనుమతి

ఢిల్లీ : ఒడిశా పవర్‌ జనరేషన్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌' ‍(ఓపీజీసీ)లోని మొత్తం ఈక్విటీ షేర్లలో 49 శాతం వాటా పొందడానికి 'అదానీ పవర్‌ లిమిటెడ్‌' ‍(ఏపీఎల్‌)కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతినిచ్చింది. ఈ ప్రతిపాదిత లావాదేవీ.., ఓపీజీసీ మూలధనంలో 49 శాతం వాటాను ఏపీఎల్‌ పొందడానికి సంబంధించినది. ఏపీఎల్‌ ఒక పబ్లిక్‌ లిస్టెడ్‌ కంపెనీ. ఈ సంస్థ షేర్లు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో నమోదయ్యాయి. అదానీ గ్రూపు ఇప్పటికే మన దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యాపారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఓపీజీసీ.., ఒడిశా ప్రభుత్వం, ఏఈఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏఈఎస్‌ ఓపీజీసీ హోల్డింగ్‌ సంస్థల జాయింట్‌ వెంచర్‌. ఒడిశా ప్రభుత్వం దీని బాధ్యతలు నిర్వహిస్తున్నది. 


logo