బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 17:27:40

ప‌రీక్ష‌ల‌పై ఇంకా నిర్ణ‌యం తీసుకోని సీబీఎస్ఈ !

ప‌రీక్ష‌ల‌పై ఇంకా నిర్ణ‌యం తీసుకోని సీబీఎస్ఈ !

దేశ‌వ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు ప‌రిధిలోని ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ గురించి ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అధికారులు ప్ర‌క‌టించారు. సీబీఎస్ఈ ప‌రిధిలోని ప‌దోత‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను మాత్ర‌మే వాయిదా వేసిన‌ట్లు అధికారికంగా సీబీఎస్ఈ ప్ర‌క‌టించింది. 1 నుంచి 9, 11వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల గురించి ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని సీబీఎస్ఈ స్పోక్‌ప‌ర్స‌న్ ర‌మా శ‌ర్మ తెలిపారు. దేశంలోని ప‌లు రాష్ట్ర‌లకు చెందిన రాష్ట్ర‌స్థాయి బోర్డులు 1-9 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌ను ఎటువంటి ప‌రీక్ష‌లు లేకుండానే ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. అయితే ర‌మా శ‌ర్మ మాట్లాడుతూ సీబీఎస్ఈ కేవ‌లం 10, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను మాత్ర‌మే నిర్వ‌హిస్తుంద‌ని, ఇత‌ర ప‌రీక్ష‌ల విష‌యం పై డైరెక్ట‌రేట్ ఆఫ్ ఎడ్యుకేష‌న్స్ నిర్ణ‌యం తీసుకోంటుంద‌ని ఆమె తెలిపారు.

దేశంలో ఇప్ప‌టికే కేంద్రీయ విద్యాల‌యాలు, గుజ‌రాత్ బోర్డు, త‌మిళ‌నాడు బోర్డులు ప‌రీక్ష‌లు లేకుండానే 1-9 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌ను ప్ర‌మోట్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించాయి. జేఈఈ ప‌రీక్ష కొత్త తేదీల గురించి వివ‌రాల‌ను

కేంద్ర‌మాన‌వ వ‌న‌రుల శాఖ  సీబీఎస్ఈ, ఎన్‌టీఏల‌ను వాకబు చేసింది. దేశంలో ఏప్రిల్ 14 వ‌ర‌కు అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు త‌ప్ప మ‌రే ఇత‌ర కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి లేద‌ని ప్ర‌ధాని ప్ర‌క‌టించిన విష‌యం అంద‌రికీ విదిత‌మే. దీంతో ఏ ప‌రీక్ష అయినా ఏప్రిల్ 15 త‌ర్వాతే జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి.


logo