గురువారం 28 మే 2020
National - May 08, 2020 , 18:44:30

జూలై ఒక‌టి నుంచి సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు

జూలై ఒక‌టి నుంచి సీబీఎస్ఈ ప‌రీక్ష‌లుహైదరాబాద్‌: సీబీఎస్ఈ ప‌ద‌వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ను జూలై ఒక‌ట‌వ తేదీ నుంచి 15వ తేదీ వ‌రకు నిర్వ‌హించ‌నున్నారు. హెచ్ఆర్డీ మంత్రి ర‌మేశ్ పోక్రియాల్ ఈ విష‌యాన్ని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న బోర్డు ప‌రీక్ష‌లు కూడా జూలైలోనే నిర్వ‌హించ‌నున్నారు.  అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్ జాబితాను రిలీజ్ చేయ‌డానికి ముందే 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తారు. జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను జూలై 18 నుంచి 23 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే మంత్రి ర‌మేశ్ పోక్రియాల్ తెలిపారు.నీట్ ప‌రీక్ష‌ను జూలై 26న నిర్వ‌హిస్తారు. 


logo