గురువారం 04 జూన్ 2020
National - May 18, 2020 , 14:07:23

CBSE ఇంటర్‌ డేట్‌షీట్‌ విడుదల

CBSE ఇంటర్‌ డేట్‌షీట్‌ విడుదల

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) ఇంటర్‌ పరీక్షల డేట్‌షీట్‌ను విడుదల చేసింది. సీబీఎస్‌ఈ ఇంటర్‌ ఆల్‌ ఇండియా పరీక్షలతోపాటు, ఈశాన్య ఢిల్లీ పరీక్షలకు సంబంధించిన తేదీలను బోర్డు సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. జూలై 1 నుంచి 15 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 1, 2, 7, 9, 10, 11, 13 తేదీల్లో సీబీఎస్‌ఈ ఇంటర్‌ ఆల్‌ఇండియా పరీక్షలు జరుగుతాయి. జూలై 3, 4, 6, 8, 14, 15 తేదీల్లో సీబీఎస్‌ఈ ఇంటర్‌ నార్త్‌ఈస్ట్‌ ఢిల్లీ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలన్నింటిని ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తారు.  logo