బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 12:55:34

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షలు వాయిదా

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షలు వాయిదా

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జాతీయ స్థాయిలో జరిగే అన్ని పరీక్షలను ఆయా బోర్డులు వాయిదా వేశాయి. ఇవాళ్టి నుంచి జరగాల్సిన సీబీఎస్‌ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం సీబీఎస్‌ఈ పరీక్షలు మార్చి 19 నుంచి 31వ తేదీ వరకు జరగాల్సి ఉండే. అయితే వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనేది మార్చి 31 తర్వాత ప్రకటిస్తామని బోర్డు అధికారులు వెల్లడించారు.

ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షలు కూడా..

ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ 10, 12వ తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. కరోనా దృష్ట్యా ఈ నెల 31 వరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడ్డ పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. 

దేశంలో కరోనా కేసుల సంఖ్య 169కి చేరింది. దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంటే ఈ వైరస్‌ బారి నుంచి బయటపడొచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


logo
>>>>>>