ఆదివారం 31 మే 2020
National - May 16, 2020 , 17:59:23

మే 18న CBSE ప‌రీక్ష‌ల డేట్‌షీట్ రిలీజ్‌‌!

మే 18న CBSE ప‌రీక్ష‌ల డేట్‌షీట్ రిలీజ్‌‌!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కార‌ణంగా అర్ధాంత‌రంగా నిలిచిపోయిన CBSE 10, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ షెడ్యూల్ విడుద‌ల మ‌రోసారి వాయిదాప‌డింది. మే 18న (సోమ‌వారం) సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల డేట్‌షీట్‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం శ‌నివారం సాయంత్రం 5 గంట‌లకు ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను వెల్ల‌డిస్తామ‌ని కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి శాఖ తెలిపింది. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యం కూడా ఒక ప్ర‌క‌ట‌న చేసింది. అయితే కొన్ని సాంకేతిక కార‌ణాలవ‌ల్ల సీబీఎస్ఈ డేట్‌షీట్ విడుద‌ల‌ను ఈ నెల 18కి వాయిదా వేశామ‌ని శ‌నివారం సాయంత్రం మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది. హెచ్చార్డీ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కాగా, జూలై 1 నుంచి 15 వ‌ర‌కు సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే ఏ రోజు ఏ ప‌రీక్ష జ‌రుగుతుంద‌నే స‌మ‌గ్ర వివ‌రాల‌తో షెడ్యూల్ విడుద‌ల కావాల్సి ఉంది.


logo