బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 13:20:41

12వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు ప్ర‌క‌టించిన సీబీఎస్ఈ..

12వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు ప్ర‌క‌టించిన సీబీఎస్ఈ..

హైద‌రాబాద్‌: సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(సీబీఎస్ఈ) ఇవాళ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది.  ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన‌ 88.78 శాతం మంది ఉత్తీర్ణులైన‌ట్లు సీబీఎస్ఈ వెల్ల‌డించింది. త‌న అధికారిక వెబ్‌సైట్‌లో ఫ‌లితాల పూర్తి వివ‌రాల‌ను సీబీఎస్ఈ పొందుప‌రిచింది. cbseresults.nic.in పోర్ట‌ల్ నుంచి విద్యార్థులు త‌మ ఫ‌లితాల‌ను చెక్ చేసుకోవ‌చ్చు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో కొన్ని ప‌రీక్ష‌లు ర‌ద్దు కావ‌డం వ‌ల్ల సీబీఎస్ఈ బోర్డు అసెస్‌మెంట్ స్కీమ్‌ను మ‌ళ్లీ స‌వ‌రించాల్సి వ‌చ్చింది. కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ర‌మేశ్ పోక్రియాల్ నిశాంక్ .. పాసైన విద్యార్థుల‌కు కంగ్రాట్స్‌ చెప్పారు.  త‌న ట్విట్ట‌ర్‌లో మంత్రి  రిజ‌ల్ట్స్ గురించి వెల్ల‌డించారు. విద్యార్థుల ఆరోగ్యం, నాణ్య‌మైన విద్య‌కు అధిక ప్రాధాన్యత‌ ఇస్తున్న‌ట్లు మంత్రి త‌న ట్వీట్‌లో తెలిపారు. logo