సోమవారం 13 జూలై 2020
National - Jun 25, 2020 , 14:51:25

సీబీఎస్ఈ పెండింగ్‌ ప‌రీక్ష‌లు ర‌ద్దు

 సీబీఎస్ఈ పెండింగ్‌ ప‌రీక్ష‌లు ర‌ద్దు

హైద‌రాబాద్‌: పెండింగ్‌లో ఉన్న సీబీఎస్ఈ 12వ, ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌, సీబీఎస్ఈ బోర్డు.. ఇవాళ సుప్రీంకోర్టుకు తెలియ‌జేసింది.  ఈ ప‌రీక్ష‌లు జూలై ఒక‌ట‌వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించాల్సి ఉన్న‌ది.  కోవిడ్ నేప‌థ్యంలో 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్లు దాఖ‌లైన నేతృత్వంలో సీబీఎస్ఈ త‌న అభిప్రాయాన్ని కోర్టుకు వ్య‌క్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్ర‌కారం మిగిలి ఉన్న ప‌రీక్ష‌ల‌ను సీఐఎస్‌సీఈ ర‌ద్దు చేస్తుంద‌ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ పేర్కొన్న‌ది. 

ప‌రీక్ష‌లు రాసే విద్యార్థులు వైర‌స్ ప్ర‌భావానికి లోన‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు విద్యార్థులు త‌ల్లితండ్రుల‌ను సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.  అడ్వ‌కేట్ రిషి మ‌ల్హోత్రా విద్యార్థుల త‌ల్లితండ్రుల త‌ర‌పున వాదించారు. వాస్త‌వానికి ఈ కేసులో మంగ‌ళ‌వారం వాద‌న‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ది. కానీ ఈ కేసును జూన్ 25వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.  ప్రాక్టిల్ ప‌రీక్ష‌లు లేదా ఇంట‌ర్న‌ల్ అసెస్‌మెంట్ ఆధారంగా మార్క్‌లు వేయాల‌ని సీబీఎస్ఈ బోర్డు భావిస్తున్న‌ది.logo