సోమవారం 25 జనవరి 2021
National - Dec 18, 2020 , 14:49:25

గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు : హ‌థ్రాస్‌పై సీబీఐ

గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు : హ‌థ్రాస్‌పై సీబీఐ

హైద‌రాబాద్‌:  దేశంలో సంచ‌ల‌నం రేపిన హ‌థ్రాస్ అత్యా‌చార ఘ‌ట‌న ప‌ట్ల ఇవాళ సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసింది.  ద‌ళిత యువ‌తిని న‌లుగురు వ్య‌క్తులు గ్యాంగ్ రేప్ చేసి చంపిన‌ట్లు సీబీఐ త‌న చార్జిషీట్‌లో పేర్కొన్న‌ది.  యూపీలోని హ‌థ్రాస్‌లో సెప్టెంబ‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  నిందితుల‌పై ఎస్సీ ఎస్టీ చ‌ట్టం కింద అభియోగాలు న‌మోదు చేశారు. హ‌థ్రాస్‌లోని ఓ కోర్టులో సీబీఐ త‌న చార్జిషీట్‌ను దాఖ‌లు చేసింది.  సెప్టెంబ‌ర్ 14వ తేదీన ఉన్న‌త కులానికి చెందిన న‌లుగురు వ్య‌క్తులు ద‌ళిత అమ్మాయిని రేప్ చేశారు. అయితే ఢిల్లీలోని హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ ఆ యువ‌తి ప్రాణాలు విడిచింది.  సెప్టెంబ‌ర్ 30వ తేదీన ఆమె మృత‌దేహానికి పోలీసులు అర్థ‌రాత్రి పూట ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించారు.  రాత్రికి రాత్రే ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించ‌డం ప‌ట్ల దేశ‌వ్యాప్త ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. కానీ ఆ సంస్కారాలు కుటుంబ స‌భ్యుల ఇష్టం మేర‌కే జ‌రిగిన‌ట్లు పోలీసులు చెప్పారు.  

ఈ కేసులో సీబీఐ విచార‌ణకు ఆదేశించిన త‌ర్వాత‌.. అల‌హాబాద్ హైకోర్టు ఆ ద‌ర్యాప్తును ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది.  ఈ కేసులో అరెస్టు అయిన న‌లుగురు వ్య‌క్తులు నిర్దోషుల‌మంటూ యూపీ ప్ర‌భుత్వానికి లేఖ రాశారు.  ఆ యువ‌తి త‌ల్లితండ్రులు, సోద‌రుడు ఆమెను వేధించిన‌ట్లు నిందితులు ఆరోపించారు. కానీ ఆ యువ‌తి పేరెంట్స్ మాత్రం దీన్ని ఖండించారు.  అయితే ఈ కేసులో విచార‌ణ‌ను పూర్తి చేసేందుకు మ‌రింత స‌మ‌యం కావాల‌ని అల‌హాబాద్ హైకోర్టును సీబీఐ కోరింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ జ‌న‌వ‌రి 27వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు.  


logo