శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 19:20:49

న‌లుగురు నేవీ అధికారులు, మ‌రో 14 మందిపై సీబీఐ కేసు

న‌లుగురు నేవీ అధికారులు, మ‌రో 14 మందిపై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: న‌లుగురు నేవీ అధికారులు, మ‌రో 14 మందిపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు న‌మోదు చేసింది. ప‌శ్చిమ నావ‌ల్ క‌మాండ్‌కు ఐటీ హార్డ్‌వేర్ స‌ర‌ఫ‌రా నేప‌థ్యంలో రూ. 6.76 కోట్ల అవినీతి వెలుగుచూసింది. నకిలీ బిల్లులు సృష్టించి సుమారు రూ.7 కోట్ల మేర కొంద‌రు అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారు. ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఢిల్లీ, ముంబై, గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని 26 చోట్ల ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. కీల‌క ప‌త్రాల‌తోపాటు రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు, విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. 6.76 కోట్ల నకిలీ బిల్లుల వ్య‌వ‌హారానికి సంబంధించి న‌లుగురు నేవీ అధికారుల‌తోపాటు మ‌రో 14 మందిపై సీబీఐ అధికారులు కేసు న‌మోదు చేశారు.


logo