శుక్రవారం 22 జనవరి 2021
National - Nov 28, 2020 , 12:43:51

బొగ్గు స్మ‌గ్లింగ్‌.. 40 చోట్ల సీబీఐ సోదాలు

బొగ్గు స్మ‌గ్లింగ్‌.. 40 చోట్ల సీబీఐ సోదాలు

హైద‌రాబాద్‌:  బొగ్గు మాఫియా కేసులో ఇవాళ సీబీఐ అధికారులు మూడు రాష్ట్రాల్లో సుమారు 40 ప్ర‌దేశాల్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.  బొగ్గు స్మ‌గ్లింగ్‌కు పాల్ప‌డిన వారి ఇండ్ల‌ల్లోనూ సీబీఐ దాడులు జ‌రుగుతున్నాయి.  ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే కేవ‌లం 25 ప్ర‌దేశాల్లో ఆ త‌నిఖీలు సాగుతున్నాయి. అక్ర‌మ రీతిలో బొగ్గును వ్యాపారం చేశార‌ని, స్మ‌గ్లింగ్ చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్న ఓ కేసులో ఈ సోదాలు జ‌రుగుతున్నాయి. బెంగాల్‌లో కోల్ మాఫియా సూత్ర‌ధారి అనూప్ మాజి ఇంట్లో కూడా సోదాలు సాగుతున్నాయి. అస‌న్‌సోల్‌లో ఉన్న ఆఫీసుతో పాటు అత‌ని స‌హ‌చ‌రుల్ని కూడా త‌నిఖీ చేస్తున్నారు.  బెంగాల్‌తో పాటు జార్ఖండ్‌, బీహార్ రాష్ట్రాల్లోనూ ఈ సోదాలు సాగుతున్నాయి.  బెంగాల్‌-జార్ఖండ్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఓపెన్ కాస్ట్ కోల్ మైన్‌లో లాలాగా గుర్తింపు పొందిన మాంజీ బొగ్గు స్మ‌గ్లింగ్ చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు అత‌నిపై దాడులు చేప‌ట్టారు.      


logo