బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 14:36:09

పోలీసుల అనుమ‌తి తీసుకోండి.. లేదంటే క్వారంటైనే

పోలీసుల అనుమ‌తి తీసుకోండి.. లేదంటే క్వారంటైనే

ముంబై: బాలీవుడ్ న‌టుడు సుషాంత్‌సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంపై ద‌ర్యాప్తు కోసం వ‌చ్చే సీబీఐ బృందం త‌ప్ప‌నిస‌రిగా ముంబై పోలీసుల అనుమ‌తి తీసుకోవాల‌ని ముంబై మేయ‌ర్ కిషోరీ ప‌డ్నేక‌ర్ సూచించారు.  లేన‌ట్ల‌యితే 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఇర‌త రాష్ట్రాల నుంచి ముంబై వ‌చ్చేవారికి పోలీసుల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అని, ఇందులో భాగంగా సీబీఐ అధికారులు కూడా ముందుగానే పోలీసుల అనుమ‌తి తీసుకోవాల‌ని చెప్పారు. 

ఇర‌త రాష్ట్రాల నుంచి ముంబై వ‌చ్చేవారికి బృహ‌న్‌ ముంబై కార్పొరేష‌న్ (బీఎంసీ) 14 రోజుల క్వారంటైన్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది. న‌టుడు సుశాంత్ సింగ్ కేసును ద‌ర్యాప్తు చేయ‌డానికి బీహార్‌లోని ప‌ట్నా నుంచి ముంబై వ‌చ్చిన ప్ర‌త్యేక పోలీస్ బృందాన్ని బీఎంసీ క్వారంటైన్‌కు త‌ర‌లించింది. ఇందులో ఐపీఎస్ అధికారి విన‌య్ తివారీ కూడా ఉన్నారు. తాజాగా వారిని క్వారంటైన్ నుంచి విడిచిపెట్టి ప‌ట్నాకు పంపించింది. 


logo