గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 01:18:00

కేంబ్రిడ్జ్‌ ఎనలిటికాపై సీబీఐ కేసు

కేంబ్రిడ్జ్‌ ఎనలిటికాపై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన పొలిటికల్‌ కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా, అదే దేశానికి చెందిన గ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ (జీఎస్‌ఆర్‌) కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ రెండు సంస్థలు నేరపూరిత కుట్రకు పాల్పడ్డాయని, ఐటీ చట్టాలను ఉల్లంఘించాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నది. చట్టవిరుద్ధంగా 5.62 లక్షల మంది భారతీయుల ఫేస్‌బుక్‌ ఖాతాల్లోని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా సంస్థ ప్రయత్నించిందని ఆరోపించింది. 

VIDEOS

logo