శనివారం 06 జూన్ 2020
National - May 16, 2020 , 13:11:04

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల షెడ్యూల్‌!

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల షెడ్యూల్‌!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌వల్ల దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. దాంతో అన్ని రకాల పరీక్షలు వాయిదాపడ్డాయి. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) కూడా 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అయితే, గత 50 రోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా దేశంలో కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. మరోవైపు నూతన విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే గడువు దగ్గర పడుతున్నది. ఈ నేపథ్యంలో వాయిదాపడ్డ సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించాలని బోర్డు ఇటీవల నిర్ణయించింది. అయితే, పరీక్షల తేదీలతో కూడిన డీటెయిల్డ్‌ షెడ్యూల్‌ను వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ శనివారం ఉదయం ఒక ప్రకటన చేసింది. సీబీఎస్‌ఈ పరీక్షల డీటెయిల్డ్‌ షెడ్యూల్‌ను ఈ సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.


logo