శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 23, 2020 , 12:35:19

నిచ్చెన దొంగ‌త‌నం చేస్తూ దొరికిపోయేస‌రికి అత‌ని ఫేస్ ఎక్స‌ప్రెష‌న్ చూడాలి!

నిచ్చెన దొంగ‌త‌నం చేస్తూ దొరికిపోయేస‌రికి అత‌ని ఫేస్ ఎక్స‌ప్రెష‌న్ చూడాలి!

కొన్ని దొంగ‌త‌నాలు వింటే అయ్యోపాపం, లేదంటే వాడికి శిక్ష ప‌డాలి అని ఏదో నోటికి వ‌చ్చింది అనేస్తాం. కానీ ఈ దొంగ‌త‌నం చూసిన‌ప్పుడు మాత్రం భ‌లే న‌వ్వొస్తుంది. చూసిన వారంద‌రూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకోవ‌డం ఖాయం. కార‌ణం ఆ దొంగ రియాక్ష‌నే. ఇంత‌కీ ఈ దొంగ ఏం దొంగ‌త‌నం చేశాడో తెలిస్తే ఓరినీ అనుకుంటారు. పెద్ద స్తంబాలు, గోడ‌లు ఎక్కేందుకు ఉప‌యోగించే నిచ్చెన‌ను బైక్ మీద పెట్టుకొని ఎస్కేప్ అవ్వాల‌నుకున్నాడు. కానీ అధికారులకు ప‌ట్టుప‌డ్డాడు.

ఆ నిచ్చెన మ‌రెవ‌రిదో కాదు ప్ర‌భుత్వానిది. చెట్ల కొమ్మ‌లు న‌రికేందుకు విద్యుత్ స‌ర‌ఫ‌రా సిబ్బంది ఆ నిచ్చెన‌ను రోడ్డు ప‌క్క‌న పెట్టారు. దొరికిందిలే సందు అని చంక‌న పెట్టుకొని బైక్ మీద ర‌య్ ర‌య్ మంటూ వెళ్తున్నాడు. అధికారులు మార్గం మ‌ధ్య‌లో ఆపి అది ఎవ‌రిదో చెప్పేస‌రికి అత‌ని ఫేస్ చూడాలి. ఈ సంఘ‌ట‌న చ‌త్తీస్‌ఘ‌డ్‌లో చోటు చేసుకున్న‌ది. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.logo