గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 17:32:45

విరిగిప‌డ్డ కొండ చ‌రియ‌లు.. క్ష‌ణాల్లో భ‌లే ఎస్కేప్‌!

విరిగిప‌డ్డ కొండ చ‌రియ‌లు.. క్ష‌ణాల్లో భ‌లే ఎస్కేప్‌!

రోడ్డు మీద పోయేట‌ప్పుడు ఎదుటివాడు డ్రైవింగ్‌, ప‌క్క‌న వ‌చ్చేవాళ్లు, వెనుక చూసుకుంటూ ఇలా అన్ని వైపులా ఒక‌ క‌న్నేసి న‌డ‌పుతుంటారు వాహ‌న‌దారులు. అయినా ప‌క్క‌నే ఉన్న ఎత్తైన కొండ‌ల నుంచి కూడా ప్ర‌మాదానికి గుర‌వుతున్నారు. బిల్డింగ్ కూలిన‌ట్లుగా క్ష‌ణాల్లో కొండ విరిగి ఇలా ఒక్క‌సారిగా రోడ్డు మీద‌కు దాడి చేస్తే పాపం అటువైపుగా వెళ్తున్న ప్ర‌యాణికులు కొండ కింద ప‌డి ప‌చ్చ‌డ‌వ్వాల్సిందే. కానీ అటుగా వెళ్తున్న ఒక ప్ర‌యాణికుడు బైక్ మీది నుంచి భ‌లే ఎస్కేప్ అయ్యాడు.

ఈ సంఘ‌ట‌న ఇండోనేషియాలో చోటు చేసుకున్న‌ది. ఉన్న‌ట్టుండి అమాంతం కొండ చ‌రియ‌లు విరిగి ప‌డ్డాయి. ఈ వీడియోను నందిని ఇడ్నాని ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది వైర‌ల్‌గా మారింది. కాక‌పోతే ఈ సంఘ‌ట‌న ఇప్పుడు జ‌రిగింది కాదు. మే నెల‌లో జ‌రిగింది. అప్పుడిది మేఘాల‌య‌లో జరిగిన‌ట్లు వైర‌ల్ అయింది. దీనిని ఖండిస్తూ మేఘాల‌య పోలీసులు ఈ సంఘ‌ట‌న ఇండోనేషియాలో జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. 

  


logo