మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 14:12:34

వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన ప‌శువుల మంద!‌.. వీడియో

వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన ప‌శువుల మంద!‌.. వీడియో

అహ్మ‌దాబాద్‌: గుజరాత్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. సోమ‌వారం ఉద‌యం నుంచి ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న కుండ‌పోత వ‌ర్షాల కార‌ణంగా ప‌లు జిల్లాల్లో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. ద్వారక జిల్లాలోని ఖంభాలియా తహసీల్‌లో సోమవారం 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సౌరాష్ట్ర ప్రాంతంలోని పోర్‌బంద‌ర్‌, గిర్ సోమనాథ్, జునాగ, అమ్రేలి జిల్లాలతోపాటు దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్, నవసరి జిల్లాల్లో రోజంతా వర్షాలు కురిశాయి.

కుండ‌పోత వ‌ర్షాల కార‌ణంగా వర్షపాతం కారణంగా జిల్లాల్లో రోడ్లు న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. పంట‌పొలాల్లో నీరు నిలిచిపోయింది. రాజ్‌కోట్ జిల్లా ప‌ద్ధారి ఏరియాలోని ఖిజాడియా మోటా గ్రామాన్ని వ‌ర‌ద‌లు ముంచెత్త‌డంతో విషాదం చోటుచేసుకుంది. ఆ వ‌ర‌ద‌ల్లో ప‌డి ప‌శువుల మంద కొట్టుకుపోయింది. ఆ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో చూడ‌వ‌చ్చు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo