బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 13:46:41

న‌డుచుకుంటూ వెళ్లే వ‌ల‌సకూలీల‌ను ఆప‌లేం : సుప్రీంకోర్టు

న‌డుచుకుంటూ వెళ్లే వ‌ల‌సకూలీల‌ను ఆప‌లేం : సుప్రీంకోర్టు


హైద‌రాబాద్‌: లాక్‌డౌన్‌తో పని కోల్పోయిన వ‌ల‌స కూలీలు స్వంత రాష్ట్రాల‌కు బాట క‌ట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. ఎవ‌రు న‌డుచుకుంటూ వెళ్తున్నారు, ఎవ‌రు వెళ్ల‌డం లేద‌న్న విష‌యాన్ని స‌మీక్షించ‌డం కోర్టుకు కుద‌ర‌ని ప‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది.  వ‌ల‌స కూలీల న‌డ‌క అంశాన్ని రాష్ట్రాలు డిసైడ్ చేయాల‌ని, దీంట్లో కోర్టు ప్ర‌మేయం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని ధ‌ర్మాస‌నం వినిపించింది. రోడ్డు మార్గంలో వ‌ల‌స వెళ్తున్న కూలీల‌ను గుర్తించి, వారికి ఆహారం, ఆశ్ర‌యం క‌ల్పించాల‌ని అలోక్ శ్రీవాత్స‌వ కోర్టులో పిటిష‌న్ వేశారు.  వ‌ల‌స కూలీల ప‌ట్ల కేంద్రం చ‌ర్య‌లు తీసుకునేలా చేయాల‌ని ఆయ‌న త‌న పిటిష‌న్‌లో కోరారు.  మ‌హారాష్ట్ర‌లో ఇటీవ‌ల రైలు ప‌ట్టాల‌పై 16 మంది చ‌నిపోయిన ఘ‌ట‌న‌ను ఆయ‌న త‌న పిటిష‌న్‌లో ప్ర‌స్తావించారు.  వ‌ల‌స కూలీల అంశంలో రాష్ట్రాలే స్పందించాల‌ని, న‌డుచుకుంటూ వెళ్లేవారు ఆగ‌డం లేద‌ని, వారిని మేం ఎలా ఆప‌గ‌ల‌మ‌ని కోర్టు ఈ సంద‌ర్భంగా పేర్కొన్న‌ది. రైల్వే ట్రాక్‌ల‌పై నిద్రించే వారిని ఎవ‌రు ర‌క్షిస్తార‌ని మ‌హారాష్ట్ర కేసులో కోర్టు అభిప్రాయ‌ప‌డింది. 


logo