బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 18:43:10

అయ్య‌య్యో.. పిల్లిని వాషింగ్ మెషీన్‌లో పెట్టి ఉతికిపారేసిన మ‌హిళ‌!

అయ్య‌య్యో.. పిల్లిని వాషింగ్ మెషీన్‌లో పెట్టి ఉతికిపారేసిన మ‌హిళ‌!

రోజూచేసే ప‌నులు అయిన‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడూ కొన్ని పొర‌పాట్లు జ‌రుగుతూనే ఉంటాయి. అలా ఈ మ‌హిళ వాషింగ్ మెషీన్‌లో పిల్లిని పెట్టి ఉతికేసింది. పాపం ఈమె కావాల‌ని చేయ‌లేదు. పొర‌పాటు వ‌ల‌న జ‌రిగింది. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లిని వాషింగ్ మెషీన్‌లో చూసి చాలా బాధ ప‌డిం‌ది. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..

అమందా మెరేదిత్ అనే మహిళ ఆస్కార్ అనే ఓ పిల్లిని పెంచుకుంటున్న‌ది. వీకాఫ్‌లో బెడ్‌షీట్లు ఉతుకుదామ‌నుకున్న‌ది. బెడ్‌షీట్ల‌న్నింటినీ వాషింగ్ మెషీన్‌లో వేసి ఆన్ చేసి త‌న ప‌నిలో నిమ‌గ్న‌మైపోయింది. ఎక్క‌డి నంచో పిల్లి అరుపులు వినిపించాయి అమందాకు. ఇళ్లంతా వెతికినా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ అరుపులు వినిపించ‌డంతో సౌండ్‌ని బ‌ట్టి వాషింగ్ మెషీన్ వైపు వెళ్లింది. అంతే.. గిరా గిరా తిర‌గుతున్న పిల్లి కాళ్లు క‌నిపించాయి. ఒక్క‌సారిగా గుండె ఆగినంత ప‌నైంది. వెంట‌నే స్విచ్ ఆఫ్ చేసింది. అయినా మెషీన్ ఆటోమేటిక్ కావ‌డంతో డోర్‌ ఒపెన్ కావ‌డానికి 10 నిమిషాలు ప‌ట్టింది. మెషీన్ తెరుచుకున్న వెంట‌నే పిల్లి బ‌య‌ట ప‌డింది. వేడి నీళ్లు, డిటర్జెంట్ నీళ్లలో మునిగినా అది బతికే ఉండటంతో ఊపిరి పీల్చుకుంది. చ‌నిపోవాల్సిన పిల్లి ఆయుష్షు ఉండ‌డంతో బ‌తికి బ‌ట్ట‌క‌ట్టింది. ల‌క్ అంటే పిల్లిదే.logo