ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 13:52:29

పొరుగువారి బొమ్మ‌ను తీసుకొని పిల్లి ఎస్కేప్‌.. తీరా చూస్తే ఆడుకుంటుంది!

పొరుగువారి బొమ్మ‌ను తీసుకొని పిల్లి ఎస్కేప్‌.. తీరా చూస్తే ఆడుకుంటుంది!

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పిల్లి వీడియో నెటిజన్ల‌ను ఆనంద‌ప‌రుస్తున్న‌ది. ఇది కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. జంతువుల అంద‌మైన వీడియోల‌ను త‌ర‌చుగా పంచుకునే ట్విట‌ర్ ఖాతా వెల్‌క‌మ్ టు నేచ‌ర్ క్లిప్‌ను పోస్ట్ చేసింది. మ‌రి వీడియోలో ఉన్న పిల్లి ఏం చేసిందో ఊహించ‌గ‌ల‌రా. సాధార‌ణంగా బొమ్మ‌లు క‌నిపిస్తే పిల్లి నోటితో చింపి లోప‌ల ఉండే దూదినంతా పీకి చింద‌ర‌బంద‌ర చేస్తుంది. కానీ ఈ పిల్లి అలా చేయ‌లేదు.

పొరుగువారి బొమ్మ‌ను అరువుగా తీసుకొని నిదానంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాగానే పులి బొమ్మ‌తో పారిపోయింది. ఇనుప కంచెపైకి ఎక్కి, వీధిని దాటి ప‌క్క‌నే ఉన్న చెట్ల‌లోకి వెళ్లింది. అక్క‌డే ఉన్న ఏకాంత ప్ర‌దేశానికి చేరుకుంది పిల్లి. ప‌చ్చ‌ని గ‌డ్డి మీద ప‌డుకొని పులి బొమ్మ‌తో ఆడుకుంటున్న‌ది. 'ఈ పిల్లి తన పొరుగువారి నుంచి ఒక ఖరీదైన రుణం తీసుకొని ఇంటికి తీసుకువచ్చింది'‌ అనే శీర్షిక‌ను జోడించారు. ఈ వీడియో చూసిన వారంతా పిల్లిని చూసి తెగ న‌వ్వుకుంటున్నారు. మ‌నుషులే కాదు జంతువులు కూడా బొమ్మ‌ల‌తో ఆడుకుంటాయి అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo