శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 06:28:23

అహ్మదాబాద్‌లో ఇక డిజిటల్‌ చెల్లింపులు

అహ్మదాబాద్‌లో ఇక డిజిటల్‌ చెల్లింపులు

అహ్మదాబాద్‌: కరోనా తీవ్రత అధికంగా ఉన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత నగరాల్లో రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్‌లో కరెన్సీ నోట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి డిజిటల్‌ పేమెంట్స్‌కు మారాలని వినియోగదారులకు సూచించింది. ఈ నెల 15 నుంచి వస్తువులను ఇండ్లకే సరఫరా చేసే సంస్థలు (హోం డెలివరీ) వినియోగదారుల నుంచి డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారానే నగదును స్వీకరించాలని సూచించింది. లాక్‌డౌన్‌ అనంతరం వైరస్‌ వ్యాప్తిచెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీన్ని అమలు చేయనున్నారు. 


logo