మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 15, 2020 , 14:00:28

పిల్లిని పట్టిస్తే నగదు బహుమతి...!

 పిల్లిని పట్టిస్తే నగదు బహుమతి...!

లక్నో‌: మాజీ ఎన్నికల అధికారి ఎస్‌వై ఖురేషీ భార్య, నేపాల్‌లోని మాజీ ఎన్నిక‌ల అధికారిణి ఇల శ‌ర్మ ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. అది క్ష‌ణం క‌నిపించక‌పోయినా అల్లాడిపోయేవారు. ఎక్క‌డికెళ్లినా  తన వెంటే తీసుకెళ్లే వారామె. ఈ క్ర‌మంలో ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్ రైల్వే స్టేష‌న్‌ వద్ద ఇల శ‌ర్మ కూతురు సాచి, డ్రైవ‌ర్ సురేంద‌ర్‌తో పాటు, త‌న పెంపుడు పిల్లితో స‌హా ఢిల్లీ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత‌లో రైలు పెద్ద శ‌బ్ధంలో కూత పెట్టుకుంటూ రావ‌డంతో బెంబేలెత్తిన‌‌ పిల్లి అక్క‌డ‌నుంచి భ‌యంతో పారిపోయింది.

అయితే త‌ప్పిపోయిన పిల్లి కోసం పలు చోట్ల వెతికినా కనిపించే లేదు. దీంతో ఆకుప‌చ్చ‌ని క‌ళ్లు, ముక్కు మీద గోధుమ రంగు మ‌చ్చ ఉండి రెండున్న‌రేండ్ల వ‌య‌సున్న‌ పిల్లి త‌ప్పిపోయింద‌ని, క‌నిపిస్తే తిరిగి ఇవ్వాలంటూ ఆమె రైల్వే స్టేష‌న్‌లోనే కాకుండా న‌గ‌రం లోనూ  చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పోస్టర్లు అతికించారు. త‌న పిల్లిని తెచ్చిచ్చిన వారికి మొదట రూ.11 వేల రివార్డు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత దాన్ని రూ.15 వేల‌కు పెంచారు. రోజులు గ‌డుస్తున్నా పిల్లి తిరిగి రాక‌పోవ‌డంతో ఆమె మార్జాలంపై బెంగ పెట్టుకున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.