బుధవారం 08 జూలై 2020
National - Jun 07, 2020 , 07:06:08

తిరుమలపై దుష్ప్రచారం చేసిన 9 మందిపై కేసు

తిరుమలపై దుష్ప్రచారం చేసిన 9 మందిపై కేసు

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై దుష్ప్రచారం చేశారనే అభియోగాలతో తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారనే టీటీడీ ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ రాశారు. నిందితుల్లో తమిళ హీరో సూర్య తండ్రి శివకుమార్‌ కూడా ఉన్నారు. శివకుమార్‌ ఒక వీడియోలో టీటీడీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారంచేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని తమిళ్‌మయ్యన్‌ అనే వ్యక్తి ఇ-మెయిల్‌ ద్వారా టీటీడీకి ఫిర్యాదుచేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను శివకుమార్‌ ఖండించారు. భక్తులకు శ్రీవారి దర్శనం జూన్‌ 30 వరకు నిలిపివేస్తారంటూ మాచర్ల శ్రీనివాసులు, ప్రశాంత్‌, ముంగర శివరాజు, Way2news short news app నిర్వాహకులు.. తిరుపతివార్త, గోదావరి న్యూస్‌వాట్సాప్‌ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేశారు. టీటీడీ ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు పెట్టారు. 


logo