గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 13:12:47

బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు

బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు

బల్లియా: ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్‌ కుమారుడు హజారీ సింగ్‌పై కేసు నమోదైంది. హజారీ సింగ్‌ 10 మంది అనుచరులతో కలిసి తనను కులం పేరుతో దూషిస్తూ, కొట్టారని రెవెన్యూ అధికారి రాధేశ్యామ్‌ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఫిర్యాదుతో హజారీసింగ్‌పై ఐపీఎస్‌ సెక్షన్‌ లోని ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బైరియా ఎస్‌హెచ్‌వో సంజయ్‌ త్రిపాఠి తెలిపారు. బైరియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సురేంద్రసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారనే విషయం తెలిసిందే. 


logo
>>>>>>