ఆదివారం 17 జనవరి 2021
National - Dec 05, 2020 , 21:49:10

తేజస్వీతోపాటు 518 మందిపై కేసు

తేజస్వీతోపాటు 518 మందిపై కేసు

ప‌ట్నా: కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా బీహార్‌లో భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, ఆ పార్టీకి చెందిన 18 మంది నేతలతోపాటు గుర్తు తెలియని 500 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పట్నాలోని గాంధీ మైదాన్‌లో శనివారం నిర‌స‌న కార్యక్రమాన్ని నిర్వహించడంపై అంటు వ్యాధుల చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ కార్య‌క్ర‌మానికి రైతులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. రైతుల‌తో క‌లిసి తేజ‌స్వి యాద‌వ్ కూడా గాంధీ మైదాన్‌లో బైఠాయించారు. ఈ సంద‌ర్భంగా నిర‌స‌నకారులు కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం వెంట‌నే రైతు వ్య‌తిరేక వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆర్జేడీ అధ్య‌క్షుడు తేజ‌స్వి యాద‌వ్‌.. ఇటీవ‌ల కేంద్రం చేసిన రైతు వ్య‌తిరేక న‌ల్ల‌ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి