ఆదివారం 07 జూన్ 2020
National - Apr 08, 2020 , 07:55:31

ఏడుగురు డాక్టర్లు, ముగ్గురు నర్సులపై కేసులు నమోదు

ఏడుగురు డాక్టర్లు, ముగ్గురు నర్సులపై కేసులు నమోదు

భోపాల్‌ : దేశాన్ని కరోనా వైరస్‌ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్‌ను తరిమికొట్టేందుకు డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో మెజార్టీ డాక్టర్లు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బంది.. విధులకు తప్పకుండా హాజరవుతున్నారు. కొంత మంది డాక్టర్లు, నర్సులైతే విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 

మధ్యప్రదేశ్‌ నర్సింగ్హాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఏడుగురు డాక్టర్లు, ముగ్గురు నర్సులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వీరంతా సెలవు తీసుకోకుండానే విధులకు హాజరు కాలేదు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు 290 నమోదు అయ్యాయి. 21 మంది ప్రాణాలు కోల్పోయారు.


logo