శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 07:48:17

శాంతికుంజ్ ఆశ్ర‌మ చీఫ్‌ ప్ర‌ణ‌వ్ పాండ్యా‌పై కేసు న‌మోదు

శాంతికుంజ్ ఆశ్ర‌మ చీఫ్‌  ప్ర‌ణ‌వ్ పాండ్యా‌పై కేసు న‌మోదు

ఢిల్లీ: హ‌రిద్వార్‌ శాంతికుంజ్ ఆశ్ర‌మ చీఫ్ ప్ర‌ణ‌వ్ పాండ్యా, అత‌డి భార్య గాయ‌త్రీ ప‌రివార్‌పై ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన బాధితుడి ఫిర్యాదు మేర‌కు జీరో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. దీనిపై  హ‌రిద్వార్‌లో  స్పందించిన పాండ్యా ఈ ఆరోప‌ణ‌లు నిరాధార‌మ‌ని, త‌గిన స‌మ‌యంతో వీటిని నిరూపిస్తామ‌ని తెలిపారు. 

కేసు వివ‌రాల్లోకి వెలితే బాధితురాలు శాంతికుంజ్‌లోని ఆశ్ర‌మంలో 2010లో చేరింది. ఆమెను ప్ర‌ణ‌వ్ పాండ్యా వేధించ‌డం ప్రారంభించాడు. ఆమె ఇత‌రుల‌కు ఈ విష‌యం చెప్పిన‌ప్పుడు వారు ఆమెను బెదించారు. ఇక్క‌డ ఉండాలంటే దీనిపై మాట్లాడ‌కూడ‌ద‌ని ఆమెకు గ‌ట్టిగా చెప్పారు. ఈ వేధింపుల మ‌ధ్య ఆమె 2014 వ‌ర‌కు అక్క‌డే ప‌నిచేసింది. 

త‌రువాత ఆమె ఇంటికి వెళ్లిపోయింది. అక్క‌డ ఫిర్యాదు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే ఆశ్ర‌మ నిర్వ‌హ‌కులు ఆమెను ఫోన్‌లో బెదిరించారు.  ఈ విష‌యంపై సీబీఐ ద‌ర్యాప్తు చేయాల‌ని బాధితురాలు డిమాండ్ చేసింది. లాక్‌డౌన్ కార‌ణంగా తాను మార్చ్ 22వ తేదీ నుంచి ఢిల్లీలో ఉండిపోయిన‌ట్లు తెలిపింది.  త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఏప్రిల్ 7వ తేదీన జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌కు ఈ మేయిల్ ద్వారా పంపిన‌ట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఢిల్లీ హెగ్డేవార్ ఆస్ప‌త్రిలో బాధితురాలికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన పోలీసులు మెడిక‌ల్ రిపోర్ట్ ఆధారంగా జీరో ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని హ‌రిద్వార్ కొత్వాలి పోలీస్‌స్టేష‌న్‌కు పంపారు.

 ఈ విష‌యంపై మీడియా ప్ర‌ణ‌వ్ పాండ్యాను సంప్ర‌దించ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా ఆయ‌న అందుబాటులోకి రాలేదు. అయితే పాండ్యా స‌న్నిహితులు మాత్రం ఈ కేసును మొత్తం కుట్ర‌గా పేర్కొన్నారు. వంట‌మ‌నిషిగా చేరిన ఆమె గ‌త 10 సంవ‌త్స‌రాలుగా డ‌బ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఆమె బ్లాక్‌మెయిల్‌కు లొంగ‌క‌పోవ‌డంతో ఈ విధంగా కేసు న‌మోదు చేసి ఆశ్ర‌మం ప‌రువు తీయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలిపారు. ఈ కేసును సుప్రీంకోర్టు వ‌ర‌కు తీసుకువెళ్లైనా విజ‌యం సాధిస్తామ‌ని, ఆశ్ర‌మంపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన వారికి శిక్ష ప‌డేలా చూస్తామ‌న్నారు. ఈ కుట్ర‌లో కొంద‌రు విదేశీయుల హ‌స్తం కూడా ఉంది. ఆశ్ర‌మ ట్ర‌స్ట్ నిధుల‌పై వారి క‌న్ను ఉంది. వారి దుష్ట ఆలోచ‌న‌లు ఎప్ప‌టికీ నెర‌వేర‌వు. త్వ‌ర‌లోనే ఈ కుట్ర గురించి బ‌హిర్గ‌తం చేస్తామ‌న్నారు.


logo