సోమవారం 06 జూలై 2020
National - Jun 25, 2020 , 18:02:06

మాస్కుల కంపెనీలో క‌రోనా క‌ల‌క‌లం.. 70 మందికి పాజిటివ్

మాస్కుల కంపెనీలో క‌రోనా క‌ల‌క‌లం.. 70 మందికి పాజిటివ్

పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. పుదుచ్చేరిలోని ఓ కంపెనీ.. మాస్కుల‌ను త‌యారు చేస్తోంది. అయితే ఈ కంపెనీ య‌జ‌మానులు లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటించ‌లేదు. కంపెనీలో ప‌ని చేసే 70 మంది వ‌ర్క‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో పుదుచ్చేరి సీఎం వీ నారాయ‌ణ‌స్వామి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మైన మాస్కుల పంపిణీని సీజ్ చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.  లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన కంపెనీపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు సీఎం. 

వ‌ర్క‌ర్లు ఏ గ్రామం నుంచి అయితే వ‌చ్చారో.. ఆ గ్రామాన్ని పోలీసులు, వైద్యాధికారులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ గ్రామంలోని ప్ర‌జ‌లంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. 

పుదుచ్చేరిలో ఇప్ప‌టి వ‌ర‌కు 461 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 9 మంది చ‌నిపోయారు. 276 కేసులు యాక్టివ్ గా ఉండ‌గా, 176 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 


logo