ఆదివారం 17 జనవరి 2021
National - Nov 26, 2020 , 10:29:13

నివ‌ర్ భ‌యం.. ఫ్లైఓవ‌ర్‌పైనే కార్లు పార్కింగ్‌

నివ‌ర్ భ‌యం.. ఫ్లైఓవ‌ర్‌పైనే కార్లు పార్కింగ్‌

హైద‌రాబాద్‌:  నివ‌ర్ తుఫాన్ భ‌యం చెన్నై ప్ర‌జ‌ల‌కు ప‌ట్టుకున్న‌ది.  ఆ తుఫాన్ వ‌ల్ల ఎక్క‌డ త‌మ వాహ‌నాలు దెబ్బ‌తింటాయో అని.. ముందే జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు.  నివ‌ర్ నిన్న రాత్రి పుదుచ్చ‌రి వ‌ద్ద తీరం దాటింది. దీంతో త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇక మ‌హాన‌గ‌రం చెన్నైలో కూడా వ‌ర్షాలు ఏక‌ధాటిగా ప‌డుతున్నాయి.  దీంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో శివారు ప్రాంతాల్లో ఉంటున్న ప్ర‌జ‌లు త‌మ వాహ‌నాల‌ను ఫ్లైఓవ‌ర్‌పైనే పార్కింగ్ చేస్తున్నారు.  2015లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల స‌మ‌యంలో.. చాలా వ‌ర‌కు ఫోర్‌వీల‌ర్ వాహ‌నాలు నీటిలో మునిగిపోయాయి. ఇండ్ల వ‌ద్ద పార్కింగ్ చేసిన ఆ వాహ‌నాలు భారీ వ‌ర‌ద‌ల వ‌ల్ల నీటిలో తేలిపోయాయి. అయితే ఈ సారి మ‌ళ్లీ ఆ ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన చెన్నై ప్ర‌జ‌లు.. ముందు జాగ్ర‌త్త‌గా త‌మ ఫోర్‌వీల‌ర్ వాహ‌నాల‌ను బ్రిడ్జ్‌ల‌పైనే పార్క్ చేశారు.  ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఫ్లైఓవ‌ర్ల‌పైనే వాహ‌నాల‌ను నిలిపారు.  మాడిప‌క్కం ప్రాంతంలో ఈ సీన్ నిన్న రాత్రి క‌నిపించింది. ప్ర‌స్తుతానికి మాత్రం 22 స‌బ్‌వేల వ‌ద్ద నీటి నిల్వ జ‌ర‌గ‌లేద‌ని గ్రేట‌ర్ చెన్నై కార్పొరేష‌న్ పేర్కొన్న‌ది.