మంగళవారం 31 మార్చి 2020
National - Mar 16, 2020 , 04:25:14

కోలుకుంటున్రు

కోలుకుంటున్రు
  • కరోనా బాధితుల్లో సగం మంది రికవరీ
  • ప్రపంచవ్యాప్తంగా సగటు మరణాలు 4%
  • భారత్‌లో రెండు శాతం కన్నా తక్కువే

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్న కరోనా పట్ల అంతగా భయపడాల్సిన అవసరంలేదని, వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని నిపుణులు చెప్తున్నారు. ఆదివారంనాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.63 లక్షల మందికి వైరస్‌ సోకినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇందులో దాదాపు 76 వేల మంది ఇప్పటికే కోలుకున్నారు. అంటే 46.7 శాతం. మిగతావారిలో దాదాపు ఆరు వేల మంది మృతి చెందారు. సగటు మరణాలు 3.7 శాతం మాత్రమే. అంటే ప్రతి వందమందిలో ముగ్గురు లేదా నలుగురు మాత్రమే మృత్యువాత పడుతున్నారు. ఇక మిగిలిన 85 వేల మంది బాధితులు ప్రస్తుతం దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 78వేల మంది పరిస్థితి మెరుగ్గా ఉన్నదని, చాలామంది కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు. అంటే దవాఖానల్లో ఉన్నవారిలో 93 శాతం మంది కోలుకుంటున్నారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 5,600 మంది (3.4 శాతం) పరిస్థితి మాత్రమే విషమంగా ఉన్నది. దీన్నిబట్టి స్థూలంగా 7.16 శాతం మందిపై (మృతులు+విషమ స్థితిలో ఉన్నవాళ్లు) మాత్రమే కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్నదని అర్థమవుతున్నది. 

భారత్‌ మరింత మెరుగు

భారత్‌ విషయానికి వస్తే, ఇప్పటివరకూ దేశంలో 110 మందికి వైరస్‌ సోకిందని, వీళ్లలో ఇద్దరు పౌరులు (1.86 శాతం) మరణించారని అధికారులు తెలిపారు. అంటే ప్రపంచ సగటు మరణాల (3.7 శాతం)తో పోల్చి చూస్త్తే, దేశంపై కరోనా ప్రభావం తక్కువే. మరోవైపు, బాధితుల్లో ఇప్పటికే 13 మంది (11%) కోలుకున్నారు. 


logo
>>>>>>