సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 10:42:25

డీజీసీఐ నోటీసును త‌ప్పుప‌ట్టిన గ్లెన్‌మార్క్‌

డీజీసీఐ నోటీసును త‌ప్పుప‌ట్టిన గ్లెన్‌మార్క్‌

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 చికిత్స కోసం గ్లెన్‌మార్క్ ఫార్మ‌సీ కంపెనీ ఫాబిఫ్లూ(ఫెవిప‌రావిర్‌) ఔష‌ధాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఔష‌ధాల‌ను మార్కెట్‌లో అధిక ధ‌ర‌కు అమ్ముతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) సోమ‌వారం గ్లెన్‌మార్క్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల‌పై స్పందిస్తూ.. ఇవాళ గ్లెన్‌మార్క్ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న చేసింది.  డీజీసీఐ చేసిన ఆరోప‌ణ‌లు బాధ్య‌తార‌హితంగా ఉన్నాయ‌ని, నిరాధారంగా ఉన్నాయ‌ని గ్లెన్‌మార్క్ పేర్కొన్న‌ది. తమ కంపెనీ సుమారు 150 మంది కోవిడ్ రోగుల‌పై ర్యాండ‌మైజ్డ్ కంట్రోల్ ట్ర‌య‌ల్ నిర్వ‌హించింద‌ని, అలాంటి ప‌ద్ధ‌తిపై డీజీసీఐ వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు అని గ్లెన్‌మార్క్ తెలిపింది. 

గ్లెన్‌మార్క్ సంస్థ అధిక ధ‌ర‌కు డ్ర‌గ్స్ అమ్ముతున్న‌ట్లు ఓ ఎంపీ ఫిర్యాదు చేశారు.  ఈ నేప‌థ్యంలో గ్లెన్‌మార్క్ సంస్థ‌కు డీజీసీఐ నోటీసులు జారీ చేసింది. స్వ‌ల్ప‌, మ‌ధ్య త‌ర‌హా క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి ఫాబిఫ్లూ మాత్ర‌ల‌ను వేయ‌వ‌చ్చు అన్న అనుమ‌తి డీజీసీఐ ఇచ్చిన‌ట్లు జూన్ 19వ తేదీన గ్లెన్‌మార్క్ ప్ర‌క‌టించింది. ఒక్కొక్క ట్యాబ్లెట్‌ను రూ.103 అమ్మేందుకు ఆ సంస్థ నిర్ణ‌యించింది.logo