శనివారం 16 జనవరి 2021
National - Dec 30, 2020 , 21:21:27

ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. ముగ్గురు బాలురు దుర్మరణం

ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. ముగ్గురు బాలురు దుర్మరణం

ఆగ్రా :  కారు అదుపుతప్పి ట్రక్కు కిందకు దూసుకెళ్లడంతో ముగ్గురు బాలురు దుర్మరణం చెందారు. ఆగ్రాలోని కుందోల్‌ ప్రాంతం ఆగ్రా-ఫతేహాబాద్‌లో రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. కుందోల్‌ ప్రాంతానికి చెందిన కృష్ణకాంత్‌ సింగ్‌ (15), ప్రవీణ్‌, ఆకాశ్‌ సింగ్‌(18) తమ స్నేహితుడి తండ్రికి చెందిన కారులో పెట్రోల్‌ కొట్టించేందుకుపెట్రోల్‌ బంక్‌కు తీసుకెళ్లారు. పెట్రోల్‌ కొట్టించి నగరంలో షికారు చేసేందుకు బయల్దేరారు. ఆగ్రా-ఫతేహాబాద్‌ రహదారిపైకి రాగానే కారు అదుపుతప్పి ట్రక్కు కిందకు దూసుకెళ్లడంతో ముగ్గురు కారులోనే దుర్మరణం చెందారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జయ్యింది.

మృతుదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో పోలీసులు జేసీబీ సాయంతో అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కారు ఎవరు నడిపింది తెలియరాలేదని ఆగ్రా తూర్పు ఎస్పీ వెంకటేశ్‌ అశోక్‌ తెలిపారు. ట్రక్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కృష్ణకాంత్‌ సింగ్‌ తొమ్మిది తరగతి, ప్రవీణ్‌, ఆకాశ్‌ సింగ్ ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు రహదారిని నిర్బంధించి నిరసన తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.