మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 17:36:17

యూపీలో ట్ర‌క్కును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి

యూపీలో ట్ర‌క్కును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సంత్ క‌బీర్ న‌గ‌ర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వెళ్లిన కారు అదుపు త‌ప్పి ట్ర‌క్కును ఢీకొట్టింది. దాంతో కారులో ఉన్న ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. జిల్లాలోని సరియా గ్రామంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. మృతులు డియోరియా జిల్లాకు చెందిన‌ అమృద్దిన్ (25), అర్మాన్ (27), అఫ్జ‌న్ (21), రియాజ్ (28), మ‌హ‌మ్మ‌ద్ (45) గా గుర్తించారు. అమృద్దిన్‌, ఆర్మాన్ ఇటీవ‌లే సౌదీ అరేబియా నుంచి భార‌త్‌కు వ‌చ్చార‌ని, మిగ‌తా ముగ్గురు ల‌క్నో నుంచి వ‌స్తూ ప్ర‌మాదానికి గుర‌య్యార‌ని చెప్పారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు తెలిపారు.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.