సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 17:25:33

క్యాన్స‌ర్ తో రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ మృతి

క్యాన్స‌ర్ తో రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ మృతి

ముంబై : ముంబైలోని సంజ‌య్ గాంధీ జాతీయ పార్కులో గురువారం ఉద‌యం రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ ఆనంద్ చ‌నిపోయింది. చ‌నిపోయిన ఆనంద్ వ‌య‌సు ప‌ది సంవ‌త్స‌రాలు. ఆనంద్ గ‌త కొంత‌కాలం నుంచి క్యాన్స‌ర్ క‌ణితితో పాటు మూత్ర‌పిండాల వ్యాధి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోంది. 

ఆనంద్ కు ఈ ఏడాది జూన్ నెల‌లో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. కింద ద‌వ‌డ భాగంలో క్యాన్స‌ర్ క‌ణితిని గుర్తించారు. దాంతో పాటు కిడ్నీ స‌మ‌స్య‌లు కూడా ఉన్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే  ఈ బెంగాల్ టైగ‌ర్ గ‌త ప‌ది రోజుల నుంచి ఆహారం ముట్ట‌డం లేదు. దీంతో పూర్తిగా అది బ‌ల‌హీన‌మైపోయింది. కేవ‌లం చికెన్ సూప్ మాత్ర‌మే తీసుకుంది. కిడ్నీలు కూడా పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. ఇటీవ‌ల నిర్వ‌హించిన సీరం క్రియాటిన్ ప‌రీక్ష‌ల్లో దాన్ని లెవ‌ల్ 40కి చేరింది. పులుల సాధార‌ణ సీరం క్రియాటిన్ లెవ‌ల్స్ 5 -6 మాత్ర‌మే. 

పులుల సాధార‌ణ జీవిత కాలం 14 నుంచి 16 ఏళ్లు. సంజ‌య్ గాంధీ నేష‌న‌ల్ పార్కులో మొత్తం ఐదు రాయ‌ల్ బెంగాల్ టైగర్స్ ఉండ‌గా.. అందులో ఒక‌టి మ‌గ పులి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo