గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 11:30:24

రాజ్‌ప‌థ్‌లో మెరిసిన కెప్టెన్ ప్రీతీ చౌద‌రీ..

రాజ్‌ప‌థ్‌లో మెరిసిన కెప్టెన్ ప్రీతీ చౌద‌రీ..

న్యూఢిల్లీ:  కెప్టెన్ ప్రీతీ చౌద‌రీ ఈ యేటీ ఆర్డీ ప‌రేడ్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. భార‌తీయ సైనిక ద‌ళానికి రిప్ర‌జెంట్ చేసిన ఏకైక మ‌హిళా ఆఫీస‌ర్ ఆమె.  140 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ ప్రీతీ.. ఆర్డీ ప‌రేడ్‌లో చిల్కా వెప‌న్ సిస్ట‌మ్‌కు నేతృత్వం వ‌హించారు. చిల్కా వెప‌న్ సిస్ట‌మ్‌లో అత్యాధునిక రేడార్లు ఉన్నాయి.  డిజిట‌ల్ ఫైర్ కంట్రోల్ కంప్యూట‌ర్లూ ఉన్నాయి. అన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో శ‌త్రు టార్గెట్ల‌ను చిల్కా వెప‌న్ ధ్వంసం చేయ‌గ‌ల‌దు.  గ్రౌండ్‌పై రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్ల‌ను ట్రాక్ చేసి క‌చ్చితంగా షూట్ చేయ‌గ‌లదు.  గాలిలోనూ 2.5 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను  ధ్వంసం చేయ‌గ‌ల‌దు. అప్‌గ్రేడ్ వెప‌న్ సిస్ట‌మ్ త‌మ రెజిమెంట్‌కు చెంద‌డం వ‌ల్ల త‌న‌కు ఆర్డీ ప‌రేడ్‌లో పాల్గొనే అవ‌కాశం వ‌చ్చింద‌ని ప్రీతీ తెలిపారు. 2016లో క్యాడెట్ రూపంలో రాజ్‌ప‌థ్‌లో మార్చింగ్ చేసిన‌ట్లు ఆమె చెప్పారు.  చెన్నైలో శిక్ష‌ణ స‌మ‌యంలోనూ ఆల్ రౌండ్ క్యాడెట్‌కి ఇచ్చే స్వార్డ్ ఆఫ్ హాన‌ర్ అవార్డు గెలుచుకుంది ప్రీతీ.  

రాజ్‌ప‌థ్ ప‌రేడ్‌లో మ‌హిళా ఫైట‌ర్ భావ‌నా కాంత్ పాల్గొన్న‌ది.  భార‌తీయ వైమానికి ద‌ళానికి చెందిన శ‌క‌ట ప్ర‌ద‌ర్శ‌న స‌మ‌యంలో ఆమె క‌నిపించారు.  ఎన్‌సీసీ గ‌ర్ల్స్ మార్చింగ్ కాంటింజెంట్ కూడా ప‌రేడ్‌లో పాల్గొన్న‌ది.  ఎన్‌సీసీ డైర‌క్ట‌రేట్‌కు చెందిన సీనియ‌ర్ అండ‌ర్ ఆఫీస‌ర్ స‌మృద్ధి హ‌ర్ష‌ల్ సంత్ నేతృత్వంలో ప‌రేడ్ జ‌రిగింది.  

VIDEOS

logo