ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 17:31:41

కరోనా ఆహారంతో.. హోటల్‌కు విపరీతమైన గిరాకీ..!

కరోనా ఆహారంతో.. హోటల్‌కు విపరీతమైన గిరాకీ..!

మధురై : కరోనా వైరస్‌ మధురైలోని ఓ ప్రముఖ హోటల్‌కు విపరీతమైన గిరాకీ తెచ్చిపెట్టింది.  ఎందుకో తెలుసా.. మధురై నగరం పరోటాలకు ఫేమస్. వివిధ రకరకాల రుచులతో రోడ్ల పక్కన ఉన్న చిన్న బండ్ల దగ్గర నుంచి పెద్ద స్టార్ హోటళ్ల వరకు పలు రకాల పరోటాలు  చేయడం ఇక్కడి ఆనవాయితి. ప్రస్తుతం కరోనా భయంతో జనం హోటళ్లకు రావడం తగ్గించారు. ఈ నేపథ్యంలో  ఓ ప్రముఖ త్రీ స్టార్ హోటల్ తమ మెనూలో మార్పులు చేసింది.

కరోనా మాస్క్ లు, కరోనా బొండాలు, కరోనా రవ్వదోసె, కరోనా బర్గర్, కరోనా కప్ కేకులు అంటూ కరోనా ఐటమ్స్‌ పేరుతో వివిధ రకాల వంటకాలను అందించడం మొదలు పెట్టింది.  ఇక ఆ హోటల్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. పెద్దసంఖ్యలో వినియోగదారులు ఆ హోటల్‌కు క్యూలు కడుతున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo