శుక్రవారం 03 జూలై 2020
National - Feb 08, 2020 , 13:34:42

ఆప్‌ కార్యకర్తను కొట్టబోయిన ఆల్కా లంబా.. వీడియో

ఆప్‌ కార్యకర్తను కొట్టబోయిన ఆల్కా లంబా.. వీడియో

న్యూఢిల్లీ : నార్త్‌ ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌, ఆప్‌ కార్యకర్తలకు మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆల్కా లంబా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తను కొట్టబోయారు. అంతలోనే అతను తప్పించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు.. ఆప్‌ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. అసభ్యకరమైన పదజాలంతో దూషించిన ఆప్‌ కార్యకర్తను పట్టుకునేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఆల్కా లంబా స్పందించారు. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి.. పోలింగ్‌ సెంటర్‌కు వెళ్లి పోలింగ్‌ సరళిని పరిశీలించే హక్కు ఉంది. తాను పోలింగ్‌ కేంద్రానికి వెళ్తే.. ఆప్‌ కార్యకర్త అసభ్యరమైన పదజాలంతో దూషించారు. తాను కొట్టబోయే సరికి పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. ఓడిపోతామనే భయంలో ఆప్‌ కార్యకర్తలు ఉన్నారని ఆల్కా లంబా పేర్కొన్నారు. చాందినీ చౌక్‌ నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్‌ గెలుస్తుందని ఆల్కా లంబా ధీమా వ్యక్తం చేశారు. ఇక తనను దూషించిన ఆప్‌ కార్యకర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఆల్కా లంబా. 


logo