మంగళవారం 07 జూలై 2020
National - Jun 17, 2020 , 14:24:38

గంట‌కు 120 కి.మీ. వేగంతో బామ్మ సైక్లింగ్ : వీడియో వైర‌ల్‌

గంట‌కు 120 కి.మీ. వేగంతో బామ్మ సైక్లింగ్ :  వీడియో వైర‌ల్‌

దీని గురించి చెప్ప‌డం కంటే వీడియో చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. వీడియోలో ఉన్న‌ బామ్మ‌ను చూస్తుంటే క‌నీసం 70, 80 ఏండ్లు అయినా ఉండొచ్చు. ఈ వ‌య‌సులో సైకిల్ తీసి ప‌క్క‌న పెట్ట‌డానికి నానా అవ‌స్త‌లు ప‌డ‌తారు. అలాంటిది సైకిల్ తొక్కుతున్న‌ది. అంత‌టితో ఆగిందా.. గంట‌‌కు 120 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. ఈ వీడియో టిక్‌టాక్‌లో చ‌‌క్క‌ర్లు కొడుతుంది. 

అయితే.. గంట‌కు 120 కి.మీ. వేగం అంటే సాధార‌ణ వ్య‌క్తుల వ‌ల్ల కూడా కాదు. అలాంటిది ఈ బామ్మ ఎలా తొక్కుతుంది అని ఆరాతీస్తున్నారు. ఇది అబ‌ద్ధం అయిన‌ప్ప‌టికీ ఈ వ‌య‌సులో ఆమె సాహ‌సానికి స‌లాం కొడుతున్నారు నెటిజ‌న్లు.
logo