బుధవారం 27 మే 2020
National - May 06, 2020 , 20:27:16

కొన్ని జాగ్రత్తలతో ప్రజారవాణా పునరుద్ధరణ: గడ్కరీ

కొన్ని జాగ్రత్తలతో ప్రజారవాణా పునరుద్ధరణ: గడ్కరీ

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 24 నుంచి ఆగిపోయిన ప్రజారవాణా వ్యవస్థను కొన్ని మార్గదర్సకాలతో తిరిగి ప్రారంభించవచ్చని కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం చెప్పారు. రవాణా, జాతీయ రహదారుల పునరుద్ధరణ ప్రజలకు భరోసా కల్పిస్తుందని ఆయన అన్నారు. అయితే బస్సులు, కార్లు నడపడంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోక తప్పదని అన్నారు. చేతులు పదేపదే కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటివి తప్పనిసరని ఆయన నొక్కిచెప్పారు. భారత బస్సులు, కార్ల ఆపరేటర్ల సమాఖ్య సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. అటు కరోనాపై, ఇటు ఆర్థిక మాంద్యంపై జరుగుతున్న పోరులో భారత్ విజయం సాధించి తీరుతుందని గడ్కరీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా సమాఖ్య సభ్యులు రవాణా రంగానికి వడ్డీ చెల్లింపు మినహాయింపులు, ప్రజారవాణా పునరుద్ధరణ, రాష్టార పన్నుల వాయిదా వంటి రాయితీలు సమకూర్చాలని మంత్రిని కోరారు.


logo