బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 19:04:05

క‌రోనా బాధిత చిన్నారుల్లో 'క‌వాసాకీ' ల‌క్ష‌ణాలు

క‌రోనా బాధిత చిన్నారుల్లో 'క‌వాసాకీ' ల‌క్ష‌ణాలు

న్యూఢిల్లీ: క‌రోనా బాధిత చిన్నారులు కొంద‌రిలో క‌వాసాకీ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని ఢిల్లీ ఆస్ప‌త్రుల‌కు చెందిన ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. క‌వాసాకీ అనేది అరుదైన వ్యాధి అని, ఈ వ్యాధి రావ‌డానికి క‌చ్చిత‌మైన కార‌ణం మాత్రం తెలియ‌ద‌ని అంటున్నారు. ఇటీవ‌ల‌ క‌రోనా పాజిటివ్‌తో ఢిల్లీలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చేరిన ప‌లువురు చిన్నారుల్లో క‌వాసాకీ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని వారు తెలిపారు.

వైద్యులు తెలిపిన ప్ర‌కారం.. ఈ క‌వాసాకీ వ్యాధి ఐదేండ్ల‌లోపు చిన్నారుల్లో క‌నిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో తీవ్ర జ్వ‌రం ఉంటుంది. దాదాపు ఐదు రోజుల‌కుపైగా జ్వ‌రం ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కాగా, ఢిల్లీలోని క‌రోనా పాజిటివ్ చిన్నారులు కొంద‌రిలో క‌వాసాకీని పోలిన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నా అది క‌వాసాకీ వ్యాధి ల‌క్ష‌ణాలే అని క‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని వైద్యులు చెబుతున్నారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo