ఆదివారం 24 జనవరి 2021
National - Dec 18, 2020 , 01:12:50

వాట్సాప్‌ వెబ్‌లోను కాల్‌ ఆప్షన్‌!

వాట్సాప్‌ వెబ్‌లోను కాల్‌ ఆప్షన్‌!

న్యూఢిల్లీ: ఇప్పటిదాకా మొబైల్‌ వర్షన్‌కే పరిమితమైన వాయిస్‌, వీడియో కాల్‌ సౌకర్యాన్ని కొన్ని వారాల్లో డెస్క్‌టాప్‌/వెబ్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సాప్‌ సన్నాహాలు చేస్తున్నది. వాట్సాప్‌ బీటా వర్షన్‌ టెస్టర్లకు ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మొబైల్‌ వర్షన్‌ తరహాలోనే వాయిస్‌, వీడియో కాల్‌ బటన్‌ చాట్‌ హెడర్‌లో ఉంటుందని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్‌ బీటా ఇన్ఫో పేర్కొన్నది.


logo