దేశవ్యాప్తంగా నిరసనలకు రైతు సంఘాల పిలుపు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 5న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఉదయం ఢిల్లీ- హర్యానా సరిహద్దులోని సింఘు వద్ద జరిగి సమావేశం అనంతరం రైతుసంఘాల ప్రతినిధులు ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా కింద పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. భేషరతుగా మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి రాతపూర్వకంగా లేఖ రాశారు. చట్టాల్లోని అభ్యంతరాలను కేంద్రానికి సమర్పించారు. అలాగే విద్యుత్ చట్ట సవరణ బిల్లును సైతం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5న గ్రామాల్లో నిరసనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. మోదీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని అన్ని రోడ్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. మరో వైపు మహారాష్ట్ర, గుజరాత్‌లోని ప్రతి జిల్లాలో గురు, శనివారాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని లోక్ సంఘర్ష్ మోర్చా నేత ప్రతిభా షిండే తెలిపారు. చట్టాలను వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని, లేకపోతే ఉద్యమం తీవ్రమవుతుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ కలకలం
- చలి గుప్పిట ఢిల్లీ.. కప్పేసిన పొగమంచు..
- ప్రధాని చెప్పారు.. ఈటల పాటించారు
- 13 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది లైంగిక దాడి
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌లు