న్యూఢిల్లీ: ఇతర దేశాల్లో పుట్టి చిన్న వయసులోనే తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లి, అక్కడే పెరిగి, చదువుకొని, లాంగ్ టర్మ్ వీసాపై ఉంటున్నవారికి పౌరసత్వం కల్పించేందుకు వీలు కల్పించే ‘చిల్ట్రన్ యాక్ట్’ బిల్లును అమెరికా చట్టసభల సభ్యులు అలెక్స్ ప్యాడిల్లా, ర్యాండ్ పాల్ బుధవారం ఉభయసభల్లోప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే 2లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. వీరిలో ఎక్కువ లాభం పొందేది భారతీయులే అని అంచనా. చిన్న వయసులో అమెరికా వెళ్లి అక్కడ ఉంటున్నవారిని ‘డాక్యుమెంటెడ్ డ్రీమర్లు’ అంటారు. వీరికి 21 ఏండ్లు నిండిన తర్వాత వెనక్కు పంపుతారు. అక్కడే ఉండాలంటే ఇమ్మిగ్రెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే.. ‘డాక్యుమెంటెడ్ డ్రీమర్లను మనం నిరాశపర్చవద్దు. చదువుల కోసం ఫీజుల రూపంలో మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో చేశారు. వారు పౌరసత్వం పొందడానికి అర్హులు’ అని అలెక్స్ అన్నారు.