శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 21, 2020 , 13:41:01

280 ఔట్ లెట్ల‌ను మూసివేసిన కేఫ్ కాఫీ డే... ఎందుకో తెలుసా?

280 ఔట్ లెట్ల‌ను మూసివేసిన కేఫ్ కాఫీ డే... ఎందుకో తెలుసా?

బెంగళూరు : కేఫ్ కాఫీ డే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం‌లో పలు ఔట్ లెట్స్ క్లోజ్ చేసింది. దాదాపు 280 ఔట్ లెట్స్‌ను మూసివేసింది. లాభదాయక అంశాలు, ఖర్చులు పెరగడం వంటి అంశాలను కారాణాలుగా చూపింది. గత ఏడాది ఏప్రిల్-నవంబర్(2019) మధ్య దాదాపు 500 ఔట్ లెట్లను మూసి వేసింది. అప్పుడు కూడా ఇదే కారణంతో మూసివేసింది. తాజా మూసివేతలతో జూన్ 30, 2020 నాటికి కేఫ్ కాఫీ డే ఔట్ లెట్స్ సంఖ్య 1,480కి తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం‌లో సేల్స్ యావరేజ్ సేల్స్ పర్ డే (ఏఎస్పీడి)15,445కి తగ్గినట్లు కేఫ్ కాఫీ డే తెలిపింది.

గత ఏడాది కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాము అన్ని బాధ్యతలను నెరవేరుస్తామని కాఫీ డే అప్పుడు ప్రకటించింది. ఆయన ఆత్మహత్య నాటికి కంపెనీ అప్పులు రూ.4,970 కోట్లుగా ఉన్నాయి. వీజీ సిద్ధార్థ మృతి అనంతరం కాఫీ డే గ్లోబల్ నాన్-కోర్ అసెట్స్ అమ్మకం ద్వారా రుణాలను క్రమంగా తీరుస్తోంది. టెక్నాలజీ బిజినెస్ పార్క్ విక్రయంపై బ్లాక్ స్టోన్ గ్రూప్‌తో డీల్ కుదిరిన అనంతరం 13 రుణసంస్థలకు రూ.1644 కోట్ల రుణాలను చెల్లించినట్లు మార్చి 2020న కేఫ్ కాఫీ డే తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో ఏఎస్పీడి 15,739గా ఉన్నాయి. మార్జిన్స్ లేదా లాభాలు తగ్గడం, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్‌మెంట్స్ పెరగడం వల్ల ఇప్పటికే ఎగుమతి కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.

అదే సమయంలో లాభదాయకత, భవిష్యత్తులో ఖర్చులు పెరగడం వంటి వివిధ కారణాలతో 280 ఔట్ లెట్లను మూసివేసింది. ఈ నిర్ణయం వల్ల మిగిలిన కేఫ్ కాఫీ డే ఔట్ లెట్స్ లాభాల్లో నడవడానికి, వాటిని యథాతథంగా కొనసాగించడానికి ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మరో విషయం ఏమంటే ఓ వైపు ఔట్ లెట్స్ సంఖ్య తగ్గినప్పటికీ వెండింగ్ మిషన్స్ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 49,397 ఉండగా ఈసారికి దాదాపు 10వేలు పెరిగి 59,115కు చేరుకున్నాయి.


logo