మంగళవారం 14 జూలై 2020
National - Jun 23, 2020 , 19:42:19

పేలిన ఐఈడీ బాంబు : సీఏఎఫ్ జ‌వాన్ కు గాయాలు

పేలిన ఐఈడీ బాంబు : సీఏఎఫ్ జ‌వాన్ కు గాయాలు

రాయ్ పూర్ : ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో రిమోట్ కంట్రోల్ ద్వారా న‌క్స‌ల్స్.. ఐఈడీ బాంబును పేల్చారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ పేలుడులో ఛ‌త్తీస్ గ‌ఢ్ ఆర్మ్ డ్ ఫోర్స్(సీఏఎఫ్) జ‌వాను తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో ఆర్చా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో కూంబింగ్ నిర్వ‌హిస్తుండ‌గా.. ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. అయితే ఆ ఏరియాలో త‌ల‌దాచుకున్న న‌క్సల్స్ పై సీఏఎఫ్ జ‌వాన్లు కాల్పులు ప్రారంభించారు. దీంతో అక్క‌డ్నుంచి న‌క్స‌ల్స్ పారిపోయారు. న‌క్సల్స్ కోసం బ‌ల‌గాలు కూంబింగ్ కొన‌సాగిస్తున్నాయి. గాయ‌ప‌డ్డ జ‌వాన్ ను చికిత్స నిమిత్తం రాయ్ పూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 


logo