బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 02:43:07

కేడీ లేడీకి 24 ఏండ్ల జైలు

కేడీ లేడీకి 24 ఏండ్ల జైలు

  • ఢిల్లీ సెక్స్‌ రాకెట్‌లో సోనూ పంజాబన్‌కు శిక్ష

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోనే అతిపెద్ద సెక్స్‌ రాకెట్‌ నడిపిన సోనూ పంజాబన్‌ అలియాస్‌ గీతా అరోరాకు ఢిల్లీలోని ఓ కోర్టు 24 ఏండ్ల జైలు శిక్షను విధించింది. ఆమె అనుచరుడు సందీప్‌ బెద్వాల్‌కు 20 ఏండ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఇరువురికీ రూ.65 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. డ్రగ్స్‌తో, చిత్రహింసలతో బాలికలను, మహిళల్ని వ్యభిచారంలోకి బలవంతంగా దింపిన సోనూపై జాలి చూపాల్సిన అవసరం కూడా లేదని తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 


logo