సోమవారం 18 జనవరి 2021
National - Dec 23, 2020 , 18:21:11

ఎస్సీ విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్స్.. 59 వేల కోట్లు కేటాయించిన కేంద్రం

ఎస్సీ విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్స్.. 59 వేల కోట్లు కేటాయించిన కేంద్రం

ఢిల్లీ : ఎస్సీ విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధ‌వారం ఆమోదం తెలిపింది. దీంతో వ‌చ్చే ఐదేళ్ల‌లో షెడ్యూల్ కూలాల‌కు చెందిన 4 కోట్ల మంది విద్యార్థులు త‌మ ఉన్న‌త విద్య‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌నున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ స‌మావేశం బుధ‌వారం జ‌రిగింది. రూ. 59,048 కోట్ల పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్స్ ప‌థ‌కానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో రూ.35,543 కోట్ల‌ను త‌న వాటాగా కేంద్రం చెల్లించ‌నుండ‌గా మిగ‌తా మొత్తం రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెల్లిస్తాయి. విద్యార్థులు 11వ త‌ర‌గ‌తి నుండి మొద‌లుకొని ఏదైనా పోస్ట్ మెట్రిక్ కోర్సును అభ్య‌సించేందుకు వీలు క‌ల్పిస్తుంది.