సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 14:44:19

హెచ్ఆర్‌డీ ఇక కేంద్ర విద్యాశాఖ‌!

హెచ్ఆర్‌డీ ఇక కేంద్ర విద్యాశాఖ‌!

న్యూఢిల్లీ: కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్‌డీ) పేరును  విద్యాశాఖ‌గా మారుస్తూ బీజేపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో జ‌రుగుతున్న‌ కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. అదేవిధంగా నూత‌న జాతీయ విద్యా విధానానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర‌వేసింది. వీటికి సంబంధించి పూర్తివివ‌రాలు మంత్రిమండ‌లి స‌మావేశం ముగిసిన త‌ర్వాత వెల్ల‌డికానున్నాయి. 

కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ‌కు ప్రస్తుతం ర‌మేశ్ పోఖ్రియాల్ నిశాంఖ్ మంత్రిగా బాధ్య‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. దేశీయ విద్యా విధానంలో భారీగా మార్పులు తీసుకురావాల్సి ఉన్న‌ద‌ని ప్ర‌ధాని మోదీ గ‌త మే నెల‌లో ప్ర‌క‌టించారు. విద్యారంగంలో సాంకేతిక‌త ప‌రిజ్ఞానం వినియోగంపై ప్ర‌త్యేక దృష్టిసారించాల‌ని చెప్పారు. 

హెచ్ఆర్‌డీ వివరాల ప్ర‌కారం జాతీయ విద్యావిధానానికి (ఎన్ఈపీ) చివ‌రిసారిగా 1992లో స‌వ‌ర‌ణ‌లు చేశారు. 1986లో మొద‌టిసారిగా ఎన్ఈపీని రూపొందించారు. మూడు ద‌శాబ్దాల త‌ర్వాత ఎన్ఈపీకి మ‌ళ్లీ ఇప్పుడు స‌వ‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్నారు.


logo