సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 02, 2020 , 19:55:52

జ‌మ్ముక‌శ్మీర్ అధికార భాష‌ల బిల్లుకు కేంద్రం ఆమోదం

జ‌మ్ముక‌శ్మీర్ అధికార భాష‌ల బిల్లుకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతమైన జ‌మ్ముక‌శ్మీర్‌‌లో అధికార భాషలపై కేంద్ర క్యాబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్న‌ది. ప్రస్తుతం అక్క‌డ అధికార భాష‌లుగా ఉన్న ఉర్దూ, ఇంగ్లిష్‌తోపాటు కశ్మీరీ, డోగ్రి, హిందీ భాషలను కూడా అధికార భాషలుగా నిర్ణయించింది. అందుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని న‌రేంద్ర మోదీ అధ్యక్షతన ఈ క్యాబినెట్ సమావేశం జ‌రిగింది. 

క్యాబినెట్ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. అయితే, జ‌మ్ముక‌శ్మీర్ అధికార భాష‌ల బిల్లుపై తదుపరి వివరాలు చెప్పేందుకు ఆయ‌న నిరాక‌రించారు. ఈ బిల్లుపై త్వ‌ర‌లోనే పార్లమెంటులో చర్చ జరుగుతుందని చెప్పారు. జ‌మ్ముక‌శ్మీర్‌‌లో అధికార భాషలుగా డోగ్రీ, హిందీ, కశ్మీరీని కూడా చేర్చాలనేది ఆ ప్రాంతవాసుల చిరకాల డిమాండ్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మరో మంత్రి జితేంద్రసింగ్ ప్రసాద్ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo