సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 02:22:15

అది కూడా ఉగ్రవాదమే!

అది కూడా ఉగ్రవాదమే!
  • సాధారణ జీవితానికి విఘాతం
  • కల్పించడమూ నేరమేషాహీన్‌బాగ్‌ నిరసనలపై
  • కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: తమ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దాలనుకోవడం, సాధారణ జీవితానికి విఘాతం కల్పించడమూ ఉగ్రవాదమేనని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ అన్నారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా కొనసాగుతున్న నిరసనలనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో శుక్రవారం జరిగిన భారతీయ విద్యార్థి సదస్సులో పాల్గొన్న ఆరిఫ్‌ పలు అంశాలపై మాట్లాడారు. నిరసనల నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రవేశికను చదువుతున్నారని, దీనికి తాను చాలా సంతోషిస్తున్నానని చెప్పారు. ఆలోచన, భావ ప్రకటన, నమ్మకం, విశ్వాసం, ఆరాధన స్వేచ్ఛను ఈ ప్రవేశిక తెలియజేస్తుందన్నారు. అయితే భావ స్వేచ్ఛ పేరుతో మీ ఆలోచనలను ఇతరులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించడం తగదన్నారు. ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయని, అంతమాత్రాన ఇతరుల సాధారణ జీవితానికి విఘాతం కల్పించకూడదన్నారు. మీ హక్కుల గురించి మాట్లాడే ముందు మీ విధులను కూడా నిర్వర్తించాలని, ఇతరుల హక్కులనూ గౌరవించాలని ఆరిఫ్‌ సూచించారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌ నుంచి ఉగ్రవాదం పూర్తిగా అంతమవుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆరిఫ్‌ అన్నారు.


logo